ETV Bharat / state

'ఎన్నికల పెట్టుబడిగా భావించి ఇప్పుడు ఖర్చు చేయండి' - జనసేన పార్టీ తాజా వార్తలు

విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత సంపన్నులు, ప్రజలది కాదని, ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టే ప్రతి పార్టీ అభ్యర్థులు ఈ విపత్తు సమయంలో ఇదే తమ పెట్టుబడిగా భావించి వరద బాధితులకు అండగా ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

PAWAN KALYAN
PAWAN KALYAN
author img

By

Published : Oct 22, 2020, 11:50 PM IST

గతంలో హైదరాబాద్​లో వరదలు వచ్చినప్పుడూ ప్రాణ నష్టం జరిగిందని.. కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ఐదారు దశాబ్దాల్లో ఎన్నడూ ఇంత వర్షపాతం నమోదవలేదని చెప్పారు. పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే వరదల్లో ప్రాణ నష్టానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన సోషల్‌ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఆ పార్టీ విడుదల చేసింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పవన్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత సంపన్నులు, ప్రజలది కాదని, ప్రభుత్వానిదేనని చెప్పారు. అనేక పన్నులు కట్టి ఒక వ్యవస్థ చేతిలో డబ్బు పెడుతున్నామని.. అందువల్ల ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలన్నారు. ఎన్నికల్లో కోట్లు రూపాయలు ఖర్చు పెట్టే ప్రతి పార్టీ అభ్యర్థులు ఈ విపత్తు సమయంలో ఇదే తమ పెట్టుబడిగా భావించి వరద బాధితులకు అండగా ఉండాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే..

'గత ఐదారు దశాబ్దాలుగా ఇంత వర్షపాతం ఎన్నడూ నమోదవలేదు. గతంలోనూ వరద నీరొచ్చి ప్రాణ నష్టం సంభవించింది. కానీ, ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే దీనికి ముఖ్య కారణం. ఎఫ్‌టీఎల్‌ (పుల్‌ ట్యాంక్‌ లోడ్‌) పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అందరూ వాటిని అతిక్రమించారు. అందుకే ఈ నష్టం సంభవించింది. ప్రస్తుత తెరాస ప్రభుత్వం నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పింది. కానీ, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పటికైనా నాలాల మీద అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అలా చేస్తే భవిష్యత్తులోనైనా ప్రాణనష్టం సంభవించకుండా ఉంటుంది.

ఆ బాధ్యత ప్రభుత్వానిదే!

ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత సంపన్నులు, ప్రజలది కాదు.. ప్రభుత్వానిదే. అధికారం ఎవరి చేతిలో ఉంటే వారే విపత్తు సహాయ చర్యలను ముందుకు తీసుకెళ్లాలి. కానీ, కొన్ని సార్లు అధికారంలో ఉన్న వారికి కూడా చేయూత అందించాలి. ప్రముఖులు, సంపన్నులు ఇలాంటి విపత్తు సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ తప్పకుండా ముందుకు వస్తారు. ఈ విషయాన్ని నేను నమ్ముతాను. మనందరం కట్టిన పన్నులు ప్రభుత్వ ఖజానాకి చేరుతాయి. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం ఇష్టానుసారం కాకుండా చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెడితే బాగుంటుంది.

అలా అనేవారు రూ.10 అయినా ఇచ్చారా?

విరాళాలు సరిపోవట్లేదు అని చెప్పేవారు తమ జేబులోంచి కనీసం 10 రూపాయలు అయినా ఇచ్చారా? కష్టపడి పనిచేసేవారికి జేబులోంచి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటే మనసు అంగీకరిస్తుందా?. చిత్ర పరిశ్రమకు ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది. కోటితో సినిమా తీస్తే 10కోట్ల రూపాయల ప్రాచుర్యం వస్తుంది. ఇక్కడ పేరున్నంతగా డబ్బు ఉండదు. ‘అత్తారింటికి దారేది’ సినిమా థియేటర్‌లో విడుదల కాక ముందే లీకైంది. ఆ సినిమాను కొనడానికి ఎవరూ రాలేదు. నేను సంతకాలు పెట్టి ఆ సినిమాను రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. పేరేమో ఆకాశమంత ఉంటుంది. డబ్బు మాత్రం ఆ స్థాయిలో ఉండదు. నిజమైన సంపద రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల దగ్గర ఉంది. ఒక సంవత్సరంలో రూపొందిన అన్ని సినిమాల బడ్జెట్ కలిపితే వేయి కోట్ల రూపాయలు కూడా ఉండదు. ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో కోటి సంపాదిస్తే పన్నులు, ఇతర ఖర్చులన్నీ తీసేస్తే చేతికి 55 లక్షల నుంచి 60లక్షల రూపాయలు వరకు మాత్రమే అందుతుంది. నష్టం వస్తే ఆ డబ్బు కూడా రాదు. ఎంతో మంది సినీ పరిశ్రమలో సర్వం కోల్పోయారు. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైంది. అందరూ దీన్ని సులువుగా లక్ష్యంగా చేసుకుంటారు.

ఏపీ సీఎం అలా చేసుండాల్సింది

ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల కోసం 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెడతారు. ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు ఎలాగూ వందల కోట్లు రూపాయలు ఖర్చు పెడతారు. ఇలాంటి ఈ విపత్తు సమయంలో అదే డబ్బును పెట్టుబడి అనుకొని.. అందులో కనీసం 50 కోట్ల రూపాయలు అయినా ఖర్చు పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. అలాంటి వారితో పోల్చుకుంటే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. నేను ముందుగా సహాయం చేసి ఇతరులను అడుగుతాను. విరాళం అనేది స్పందించి ఇవ్వాలి తప్ప.. మీరెందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నలు అడగకూడదు. తెలంగాణ ప్రభుత్వానికి అందరూ ఇచ్చారంటే ముఖ్యమంత్రి ముందుగా కోరారు. అందువల్ల ఇబ్బందైనా అందరూ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా అందర్నీ సంప్రదిస్తే బాగుంటుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన, ఓడిపోయిన ప్రతి పార్టీ అభ్యర్థులు ఈ విపత్తు సమయంలో ఇదే తమ పెట్టుబడి అనుకొని వరద బాధితులకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా' అని పవన్‌ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.