ETV Bharat / state

Medical Colleges standards ప్రపంచస్థాయిలో బోధనాసుపత్రిలో ప్రమాణాలంటోన్న ప్రభుత్వం..! పనితీరు ఘోరమన్న పీఏజీ! - వైద్య కళాశాలల్లో సౌకర్యాల కొరత

Lack of facilities in medical colleges కొత్త వైద్య కళాశాలల్లో అత్యుత్తోమ ప్రపంచస్థాయి ప్రమాణాలంటోన్న ప్రభుత్వం.. ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో ఉన్న దారుణమైన పరిస్థితులను పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమైన బోధనాసుపత్రుల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించిన ప్రిన్సిపల్ అండ్ అకౌంటెంట్ జనరల్.. ఆసుపత్రుల్లో ప్రమాణాలు ఘోరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

Medical Colleges
సర్కారీ ఆసుపత్రిలో పడకేసిన ప్రమాణాలు.. వైద్య విద్యలో నిర్వహణ అధ్వానం
author img

By

Published : Jul 29, 2023, 12:00 PM IST

Lack of facilities in medical colleges:పేద, మధ్యతరగతి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు, నైపుణ్యం కలిగిన వైద్యులను తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ బోధనాసుపత్రుల పనితీరు ఘోరంగా ఉంది. వీటిల్లో చదివే మెరిట్ విద్యార్థులకు అరకొర సౌకర్యాల మధ్యే బోధన సాగుతోంది. వైద్య విద్యలో కీలకమైన లేబొరేటరీల నిర్వహణ ఘోరంగా ఉంది. విద్యార్థులు వసతి గృహాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జాతీయ వైద్య కమిషన్ రూపొందించిన 'మినమం స్టాండర్డ్ రిక్వైర్‌మెంట్ రెగ్యులేషన్స్ -2020 ప్రకారం అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు బోధనాసుపత్రుల్లో సౌకర్యాలు లేవని పీఏజీ గతేడాది గుర్తించింది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య ఉన్న రికార్డులు పరిశీలించింది. అందులో వాటి పనితీరు ఘోరంగా ఉందని తేల్చింది.

శ్లాబ్‌ నుంచి పెచ్చులు.. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివే విద్యార్థుల్లో సుమారు 450 మంది 1985లో నిర్మించిన వసతిగృహాల్లో ఉంటున్నారు. వీరి కోసం కొత్తగా నిర్మించిన నూతన భవనం ఇంకా వినియోగంలోకి రాలేదు. వర్షపు నీరు గదుల్లో నిల్వ ఉంటోంది. శ్లాబ్‌ నుంచి పడే పెచ్చులతో విద్యార్ధినులు భయం భయంగా గడుపుతున్నారు.

వర్షపు నీరు గదుల్లో నిల్వ.. రాజమహేంద్రవరం వైద్యశాలను బోధనాసుపత్రిగా మార్చి వైద్య కళాశాలను మంజూరు చేసినా రోగులకు అందే సేవలు, వసతుల కల్పనలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. 5 కోట్లతో ఆసుపత్రి పాత భవనాన్ని ఆధునికీకరించినట్లు చెబుతున్నా.. చినుకుపడితే శ్లాబు నుంచి నీరు కారుతోంది. మాతాశిశు విభాగంలో ఇటీవల లిఫ్ట్‌ గోడ కూలి 8 మంది గాయపడ్డారు. తిరుపతి రుయాలోని చిన్నపిల్లల ఆసుపత్రి, ప్రసూతి ఆస్పత్రిలో 4 లిఫ్టులు పనిచేయడం లేదు. కాకినాడ సర్వజన ఆసుపత్రిలోని మెడికల్‌ వార్డులో లిఫ్ట్ ఎప్పటి నుంచో మొరాయించింది. కొత్త ట్రామా కేర్ భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మూడేళ్ల నుంచి ఎంఆర్ఐ సేవలు లేవు. ఏడు ఎక్సరే యంత్రాల్లో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి.

అరకొరగా సౌకర్యాలు.. అనంతపురం, శ్రీకాకుళం బోధనాసుపత్రిలో ఉన్న 100 ఎంబీబీఎస్ సీట్లను 2013లో 150కు పెంచారు. నెల్లూరు జీజీహెచ్‌లోనూ 150 ఎంబీబీఎస్ సీట్లను 175కు పెంచారు. ఈ మూడింటికి నిర్దేశించిన దాని కంటే స్థలం ఎక్కువగా ఉన్నా.. సౌకర్యాల కల్పన మాత్రం తక్కువే. శ్రీకాకుళం, అనంతపురం వైద్య కళాశాలల్లో లెక్చర్ హాలు కొరత ఉంది. వైద్య కళాశాలల్లో ఎగ్జామినేషన్ హాళ్లు అవసరాలకు తగ్గట్లుగా లేవు. వసతిగృహాల్లోనూ నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేదు. మూడుచోట్ల ఫ్లోర్ టైల్స్ దెబ్బతిన్నాయి. నెల్లూరు, అనంతపురం హాస్టల్స్ 3 అంతస్తుల్లో ఉన్నా.. వాటికి లిఫ్ట్ లేదు. ఈ మూడు ఆసుపత్రుల్లోని 8 ప్రధాన డిపార్టుమెంట్లలో అవసరాలకు తగ్గట్టు పరికరాలు లేవు. ముఖ్యంగా సైకాలజీ విభాగంలో 85 పరికరాలకు గాను 47 కొరత ఉన్నాయి.

పడకల కొరత.. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం జీజీహెచ్‌లలో పడకలు కూడా లేవు. నెల్లూరు జీజీహెచ్‌లో 900 పడకలకు 870 మాత్రమే ఉన్నాయి. అనంతపురం జీజీహెచ్‌లో 650 పడకలకు 627 , శ్రీకాకుళం జీజీహెచ్‌లో 650 పడకలకు 633 చొప్పున ఉన్నాయి. నెల్లూరు జీజీహెచ్‌ గైనిక్‌లో 20, అనంతపురంలో ఆర్థో విభాగంలో 20, శ్రీకాకుళంలో ఆర్థోలో 15 పడకలు తక్కువగా ఉన్నాయి. అనంతపురం సూపర్ స్పెషాలిటీలో 3 డిపార్టుమెంట్లు ఉపయోగంలో లేవు. ఈ మూడు ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలుకు 41 కోట్ల 57 లక్షలను కేటాయించగా.. 39 కోట్ల 91 లక్షలకు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఇందులో 17కోట్ల 40 లక్షల విలువైన పరికరాలు వినియోగంలోకి రాకుండా నాలుగేళ్ల నుంచి అలాగే మూలన ఉన్నాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం.. ఫైర్‌ సేఫ్టీ డిపార్టుమెంట్ నుంచి ఈ మూడు ఆసుపత్రులు ఎన్వోసీ పొందలేదు.

శిథిలావస్థలో విశాఖ కేజీహెచ్‌ భవనాలు.. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన విశాఖ కేజీహెచ్‌లోని భవనాల్లో చాలా శిథిలావస్థలో ఉన్నాయి. పెథాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, పరిపాలన విభాగం , ఫిజియాలజీలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఎంఆర్‌ఐ స్కాన్ లేకపోడంతో రోగులు ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు.

బోధనాసుపత్రిలో ప్రమాణాలు ఘోరమన్న పీఏజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.