Labours Facing Problems Under YSP Rule: జాతీయ నేరగణాంక సంస్థ (NCRB) తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు - ఆత్మహత్యల సమాచార నివేదిక విశ్లేషిస్తే రాష్ట్రంలోని పరిస్థితులు కళ్లకు కడతాయి. రాష్ట్రంలో గతేడాది ఆత్మహత్యాయత్నం చేసిన ప్రతి వంద మందిలో 32 మంది రోజు వారీ కూలీలే. 2022లో మొత్తం 8 వేల 908 మంది బలవన్మరణాలకు పాల్పడగా వారిలో 2 వేల 889 మంది రోజు వారీ కూలీలు. వీరిలో 2 వేల 520 మంది పురుషులు కాగా 369 మంది మహిళలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా గతేడాది 45 వేల 194 మంది రోజు కూలీలు ఆత్మహత్య చేసుకోగా అందులో 6.39 శాతం ఏపీలో జరిగాయి. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలి పనుల కోసం రాష్ట్రానికి వచ్చేవారు. అలాంటిది గతేడాది ఆ నాలుగు రాష్ట్రాల్లో 1 వెయ్యి 478 మంది కూలీలు ఆత్మహత్యలు చేసుకోగా ఆంధ్రప్రదేశ్లో జగన్ నాలుగేళ్ల పాలనలో 10 వేల 571 మంది రోజుకూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
ఈ పాపం ఎవరిది - పింఛన్ తొలగించారన్న ఆవేదనతో అంధురాలు ఆత్మహత్య
ఈ పాపం వైసీపీ ప్రభుత్వానిదే: వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని జగన్ రద్దు చేశారు. ఆ తర్వాత ఇసుక దొరకక కొన్ని నెలల పాటు భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కరోనా కారణంగా ఆ సంక్షోభం మరికొని సంవత్సరాలు సాగింది. సాధారణంగా భవన నిర్మాణ రంగంలోనే ఎక్కువమంది కూలీలకు పని దొరుకుతుంది. జగన్ ప్రభుత్వం ఈ రంగాన్ని దెబ్బతీయడంతో భవన నిర్మాణ రంగంలో మరింత సంక్షోభం నెలకొంది. అంతే కాకుండా రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కూడా పడిపోవడంతో అక్కడ ఉపాధి పొందేవారికీ ఇప్పుడు పనులు లేకుండా పోయాయి.
భార్యను అమ్మైనా డబ్బు చెల్లించాల్సిందే - వైసీపీ కౌన్సిలర్ వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం
టీడీపీ హయాంలో జోరుగా స్థిరాస్తి రంగం: ఏపీ, తెలంగాణ విభజన తర్వాత టీడీపీ హయాంలో అమరావతి, పోలవరం పనులు చురుగ్గా సాగేవి. స్థిరాస్తి రంగం జోరు మీద ఉండేది. దీంతో ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన పని ఉండేది కాదు. కూలీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి చెల్లాచెదురైంది. గతంలో నెలంతా పని చేసుకునేవారు ఇప్పుడు ఖాళీగా కూర్చుంటున్నారు. ఎవరొచ్చి పనుల కోసం పిలుస్తారా అని దీనంగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే కూలీల ఆకలిచావులు సంభవిస్తున్నాయని కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు.
వైసీపీ వీధిరౌడీల్లా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది - ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ ఘటనపై లోకేశ్ ఆగ్రహం
వైసీపీ అసమర్థ విధానాలతోనే కూలీల ఆకలిచావులు: సాధారణంగా రోజూ పని చెస్తేనే కూలీలకు ఇల్లు గడవడం కష్టం. వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తారు. అలాంటిది గత నాలుగున్నరేళ్లుగా నెలలో సగం రోజులైనా వారికి పని దొరకట్లేదు. ఆదాయం లేక, ఇల్లు గడవక అప్పుల పాలవుతున్నారు. దీనికి తోడు అధిక ధరలు, విద్యుత్తు ఛార్జీలు ఇలా ప్రతీ వస్తువుకు ధరలు పెరగడంతో వారిపై అధిక భారం ఏర్పడి మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిపోతున్నారు. చివరికి కూలీలకు భవిష్యత్తుపై భరోసా కనిపించక, వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.