మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భక్తులు త్రికోటేశ్వరునికి రూ.1,69,36,870 కానుకల రూపంలో సమర్పించారు. బుధవారం ఆలయాధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.73,07,721 నగదు, 28.3 గ్రాముల బంగారం, 1,125 గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించుకున్నారు.
పూజ టిక్కెట్ల రూపంలో రూ.64,36,981, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.30,33,840, ఇతర ఆదాయాల ద్వారా రూ.1,58,328 సమకూరినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.28,26,923 అదనంగా ఆదాయం లభించినట్లు ఈవో రామకోటిరెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపును దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఈవో, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి
కోటప్పకొండ తిరునాళ్లకు పోటెత్తిన భక్తజనం.. ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు