గుంటూరులోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సభ జరిగింది. ఆ మహనీయుల చిత్రపటాలకు భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, చందు సాంబశివరావు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి తక్కువ సమయం ప్రధానిగా పనిచేసినా జై జవాన్, జై కిసాన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని కన్నా లక్ష్మీ నారాయణ కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు