ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ప్రజానాట్య మండలి కళాకారులు ఆవేదన చెందారు. ఆర్నెల్లుగా తమకు పింఛను అందడం లేదన్నారు. ప్రభుత్వం పెంచిన పింఛన్ తో పాటు తక్షణం చెల్లింపులు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయకుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ నుంచి జడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మీకోసం లో అధికారులకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం స్పందించకుంటే నాలుగు వారాల తరువాత కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి-విత్తనాల కోసం అన్నదాతల విలవిల