ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించి సాగు చేస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. నిజాంపట్నం మండలం దిండి పంచాయతీ తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మండల పరిధిలోని తీర ప్రాంతంలో 280 ఎకరాలల్లో ఆక్వా పార్కు, హేచరీ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుందని తెలిపారు. ఈ భూములు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్నాయా, వెలుపల ఉన్నాయా? అని పరిశీలించారు. వెలుపలే ఉండటం వల్ల నిర్మాణాలకు భూములు అనుకూలమని స్పష్టం చేశారు.
వాన్పిక్ భూములకు నోటీసులు..
వాన్పిక్ కోసం కొనుగోలు చేసిన 2 వేల 131 ఎకరాల భూమి ఈడీ పరిధిలో ఉంది. దానిలో 12 వందల 10 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఆక్రమణలో ఉన్న భూములను తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ తెలిపారు. ఆక్రమించి సాగు చేస్తే చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు మండల తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: