విద్యుదాఘాతంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన పులి నాగ బాలాజీ అనే వ్యక్తి... రాజస్థాన్ జోధ్‌పుర్‌లో ఆర్మీలో హవల్దార్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే సెలవులపై ఇంటికి చేరాడు.
పొన్నూరు పట్టణం 19 వ వార్డు నూతనంగా నిర్మించుకున్న ఇంటి వద్దకు వెళ్ళాడు. శుక్రవారం సాయంత్రం కరెంటు వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చదవండి: