ETV Bharat / state

నేడు జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

గుంటూరు జిల్లాలో నేడు జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో జరగునున్న ఈ సమావేశంలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు,పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.

Janasena
Janasena
author img

By

Published : Apr 4, 2022, 8:24 PM IST

Updated : Apr 5, 2022, 1:45 AM IST

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. వైకాపా ప్రభుత్వ పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, రైతులు-వ్యవసాయ స్థితిగతులు, పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే కాలంలో పార్టీ తరపున చేపట్టవలసిన కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తారు.

మంగళగిరిలో జరగనున్న ఈ సమావేశంలో పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, వీర మహిళా ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఇదీ చదవండి : Jinnah Tower: "జిన్నా పేరు దేశానికే మాయని మచ్చ" పేరుతో కర పత్రాలు

Last Updated : Apr 5, 2022, 1:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.