గుంటూరు జిల్లాలో...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. సుమారు 20 కిలోమీటర్లు కాలినడకన ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ అధినేత కరోనా నుంచి క్షేమంగా బయటపడి.. ప్రజలకు మరింత సేవ చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు నేతలు తెలిపారు.
తిరుపతిలో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ తిరుపతిలో జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. హారతి వెలిగించి పవన్ ఆరోగ్యకరంగా తిరిగి రావాలని స్వామివారిని వేడుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కరోనా నుంచి కోలుకోవాలని జనసైనికులు గంగమ్మ తల్లికి వేడుకున్నారు. కవిటి మండలంలోని కాపాస్ కుద్ధి తీరంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చదవండి: