ETV Bharat / state

Jagan Trip to London in Luxury Plane: అయ్యో పాపం.. చార్టర్డ్‌ విమానంలో వెళ్లేంత పేదరికమా పేదల పక్షపాతి జగనన్నది

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 9:21 AM IST

Updated : Sep 7, 2023, 9:43 AM IST

Jagan Trip to London in Luxury Plane: పేదలు ఫ్లైట్‌లో వెళ్లడమే కష్టం అలాంటిది ప్రత్యేకంగా ఫ్లైట్‌ బుక్‌చేసుకుని వెళ్లగలరా? నిజమైన పేదలకు అది కష్టమే. కానీ పేదపలుకులు పలికే జగన్ లాంటి సంపన్నులకు చిటికెవేసినంత పని పదిరోజుల లండన్‌ పర్యటనకు వెళ్లిన జగన్‌ గంటకు 2లక్షల 71 వేలు పెట్టి లండన్‌కు ప్రత్యేక విమానం బుక్‌ చేసుకున్నారు. ఓవైపు పేదల పక్షపాతినంటూ కలరింగ్‌ ఇస్తూ విలాసవంతమైన ప్రయాణాలు చేయడం ఎవర్ని మభ్యపెట్టడానికనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

jagan_trip_to_london_in_luxury_plane
jagan_trip_to_london_in_luxury_plane
Jagan trip to London in a luxury plane: అయ్యో పాపం.. విలాసవంతమైన చార్టర్డ్‌ విమానంలో వెళ్లేంత పేదరికమా పేదల పక్షపాతి జగనన్నది

Jagan Trip to London in Luxury Plane: అనగనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. తల్లి కూడా పేదరాలే. వాళ్ల పిల్లలు, తోటమాలి, వంటవాడు, ఆఖరికి కారు డ్రైవర్‌ కూడా పేదలే. పాపం వాళ్లు తినడానికి చికెన్‌ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కారులో వెళుతుండగా.. ఇది కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమాలో బడి ఎగ్గొట్టిన ఓ కుర్రాడు తండ్రిని మభ్యపెట్టేందుకు చెప్పిన కథ. స్కూల్లో కథల పోటీ ఉందని, దాని కోసం మంచి కథ ఆలోచించేందుకు సెలవు పెట్టానని ఆ కుర్రాడు చెబుతాడు. ఏం ఆలోచించావో చెప్పమని ఆ తండ్రి అడిగితే.. అలా ఓ కథ చెప్పుకొచ్చి తండ్రితో తన్నులు తింటాడు.

SC ST Farmers in Jagan Government: నా ఎస్సీ.. నా ఎస్టీలు.. అంటూనే కత్తరేశారు! సూక్ష్మసేద్యంపై విమర్శలతో దిగొచ్చిన జగన్ సర్కార్!

ఆ సన్నివేశం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. సినిమాలో ఆ కుర్రాడు చెప్పినలాంటిదే ఇప్పుడు మరో కథ చెప్పుకుందాం. ఇప్పుడు ఆ రీల్‌ స్టోరీని మన సీఎం జగన్‌ ప్రతీసభలోనూ చెప్తుంటారు. దాన్నిబట్టి జగన్‌ ఓ పేద సంపన్నడు. అదెలాగంటారా.? తెల్లారిలేస్తే పేదల పక్షపాతినని ఊదరగొడతారు. పేదలు, పెత్తందారులు, క్లాస్‌వార్‌ అంటూ ప్రతీ సభలో పాట పాడతారు. ఆయన థియరీ ప్రకారం ఆయన నిరుపేదే! ఎంతగా అంటే బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాలతోపాటు తాడేపల్లి, పులివెందుల, ఇడుపులపాయల్లో విలాసవంతమైన ప్యాలెస్‌లున్నా సొంత విమానం కూడా కొనుక్కోలేనంత కటిక పేద సంపన్నుడాయన.

State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు

Jagan London Tour Cost: తానో సర్వసంగ పరిత్యాగినని, పేదల పక్షపాతినని ఊదరగొడతారు జగన్..! అలాంటాయన లండన్‌లో ఉన్న కుమార్తెలను చూసేందుకు అత్యంత విలాసవంతమైన విమానంలో వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్‌ దంపతులు పది రోజుల పర్యటన కోసం గత శనివారం ‘ఎంబ్రాయెర్‌ లినేజ్‌ 1000’ అనే విమానంలో వెళ్లారు. 435 కోట్ల రూపాయల విలువైన ఆ విమానంలో సుమారు 19 మంది ప్రయాణించొచ్చు. అందుకోసం గంటకు సుమారు 14 వేల 850 డాలర్ల అద్దె చెల్లించాలి. మన కరెన్సీలో గంటకు సుమారు 2 లక్షల 71 వేలు చెల్లించాలి. ఇంధనం నింపుకోవడానికి నిలిపే సమయం కూడా కలిపితే విజయవాడ నుంచి లండన్‌ వెళ్లేందుకు సుమారు 11 గంటలు పడుతుంది. అటు నుంచి రావడానికి మరో 11 గంటలు పడుతుంది.

ఒకవేళ విమానాన్ని పర్యటన ఆసాంతం జగన్‌ తనతోనే ఉంచుకుంటే దానికి పార్కింగ్‌ ఛార్జీలు ఇతరత్రా ఖర్చులు చాలా ఉంటాయి. మొత్తం మీద జగన్‌ లండన్‌ టూర్‌కు కొన్ని కోట్లు ఖర్చవుతుంది.! జగన్‌ లండన్‌ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే కావొచ్చు.! అదంతా సొంతంగానే భరిస్తూ ఉండొచ్చు. కానీ పేదపలుకులు పలుకుతూ పెత్తందారీ ప్రయాణాలు చేయడం ఎవర్ని మభ్యపెట్టడానికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్‌ ఇప్పుడే కాదు గతంలో దావోస్‌కీ ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన విమానంలోనే వెళ్లారు. ప్రయాణికుల విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించడమూ ఆడంబరమే అవుతుందని ఆయన భావిస్తారేమో.

Chandrababu Naidu Fire on CM Jagan: ప్రజల తలపై అప్పుల కుంపటి.. జగన్‌ లండన్‌లో విహారయాత్రలు: చంద్రబాబు

Jagan is Going in Helicopters for Official Visits and Meetings in State: విదేశీ ప్రయాణాల్లోనే కాదు స్వదేశీ ప్రయాణాల్లోనూ పేదలు కుళ్లుకునేంత నిరాడండరత ప్రదర్శిస్తారు జగన్‌.! రాష్ట్రంలో అధికారిక పర్యటనలు, సభలు, సమావేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తారు.. 2, 3 కిలోమీటర్ల దూరంలోని సభలకూ హెలికాప్టర్లలో వెళుతూ ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తారు. చివరకు అమరావతి రాజధానిలో తన ఇంటికి అత్యంత సమీపంలో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికీ హెలికాప్టర్‌లోనే వెళ్లారాయన.. ఇదీ దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ఉన్న జగన్‌ నిరాడంబరత.! ఆయన రాష్ట్ర పర్యటనల సందర్భంగా హెలిప్యాడ్‌లు నిర్మించిన చిన్నచిన్న కాంట్రాక్టర్లకూ బిల్లులు చెల్లించకుండా ఏడిపించేంత పేదల పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్​.

Last Updated : Sep 7, 2023, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.