ETV Bharat / state

జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ

ఈనెల 30న జగన్​ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

author img

By

Published : May 25, 2019, 2:49 PM IST

Updated : May 25, 2019, 6:37 PM IST

జగన్ ప్రమాణ స్వీకారం వేదిక.. మున్సిపల్ స్టేడియం

వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక ఖరారైంది. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చర్చించారు. గవర్నర్ సహా ముఖ్యులు హాజరవుతున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

కార్యక్రమానికి వచ్చేవారికి 5 కేటగిరీలుగా పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. స్టేడియంలోకి 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎండల దృష్ట్యా స్టేడియంలో ఏసీలు, కూలర్లు, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. స్టేడియం వెలుపల ఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను కృష్ణా కలెక్టర్, విజయవాడ సీపీ, మున్సిపల్‌ కమిషనర్ పరిశీలించారు. ప్రమాణ స్వీకారానికి దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలిపివేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విశాఖ, చెన్నై నుంచి వచ్చే వాహనాలు శివార్లలో నిలిపివేయనున్నారు. పార్కింగ్ కోసం 5 రకాల ఎంట్రీ పాస్‌లు జారీ చేయాలని సీఎస్ ఆదేశించారు. పార్కింగ్‌కు ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్​ను ఎంపిక చేశారు.

ఇవీ చదవండి..

రేపు దిల్లీకి జగన్​.. ప్రధానికి ఆహ్వానం

Intro:FILENAME: AP_ONG_31_25_PERIGINA_ENDA_TIVRATA_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు . ప్రజల నడి నెత్తిపై నిప్పటి కుంపటిలా తయారైయ్యాడు. తీవ్ర ఎండ వేడికి ప్రజలు హడలెత్తిపోతున్నారు. పది గంటల తరువాత విధుల్లోకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.పట్టణం లోని మధ్యాహ్నానికి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్లలలో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే తమ వెంట విధిగా కండువా, కర్చీఫ్, టోపీలు పెట్టుకుంటున్నారు.శీతల పానీయాలు, షర్బాత్ కేంద్రాలు వినియోగదారుల తో కిటకిటలాడుతున్నాయి

Body:కిట్ nom 749

Conclusion:9390663594
Last Updated : May 25, 2019, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.