గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడులో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు జూలియన్పై సొంత అన్న యెహోను కల్లు గీసే కత్తితో దాడి చేశాడు. గాయపడిన అతడిని బంధువులు బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పిడుగుపాటు శబ్ధానికి బాలుడు మృతి