దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి గగన్ యాన్ -2 ప్రాజెక్టును ప్రయోగిస్తామని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ధీమాను వ్యక్తం చేశారు .భూమండలాన్ని మనుషులు చుట్టిరావడమే గగన్ యాన్ లక్ష్యమని తెలిపారు. గుంటూరు జిల్లా అమరావతిలోని ఎస్ఆర్ఎం సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన చంద్రయాన్-2 మంచి ప్రయోగమని అభిప్రాయపడ్డారు. చంద్రుడిని నిశ్చితంగా పరిశీలించేందుకు, నీటిజాడల్ని కనుగొనేందుకు ఆ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి గగన్ యాన్-2: ఇస్రో మాజీ ఛైర్మన్ - ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్
దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి ఇస్రో గగన్ యాన్-2 ప్రాజెక్టును ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సన్నాహాలు చేస్తుందని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలోని ఎస్ఆర్ఎం సాంకేతిక ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇస్రో మాజీ ఛైర్మన్