ETV Bharat / state

Irregularities in MGNREGA Works: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. సామాజిక తనిఖీల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in MGNREGA works

Irregularities in Employment Guarantee Scheme inspections: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల తనిఖీ బృందాల అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నాలుగేళ్లగా సామాజిక తనిఖీల (Social Audit) పేరుతో విచ్చలవిడిగా కమీషన్లు దండుకుంటున్నారు. లక్ష రూపాయల విలువైన పనులకు పదివేల చొప్పును వసూలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. దీంతో తనిఖీ బృందాలకు ఇచ్చిన మామూళ్లను సంపాదించడం కోసం కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

irregularities_in_mgnrega_works
irregularities_in_mgnrega_works
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 12:23 PM IST

Irregularities in MGNREGA works: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. సామాజిక తనిఖీల పేరుతో భారీగా దోపిడీ

Irregularities in Employment Guarantee Scheme Inspections: ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఈ మేరకు పనుల నిర్వహణ కూలీల వేతనాలకు ఏటా దాదాపు 6 వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. నిధుల వినియోగంతో పాటు పనుల్లో పారదర్శకతకు.. ప్రతి పంచాయతీలోనూ ఏటా సామాజిక తనిఖీలు చేస్తుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సామాజిక తనిఖీలు, జవాబుదారీతనం, పారదర్శకత సంస్థ పని చేస్తోంది.

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు.. పాత పనులకు కొత్త బోర్డులు

Irregularities in MGNREGA Works: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో సామాజిక తనిఖీ బృందాలది (Social Audit) కీలకపాత్ర. లేని కూలీల పేరుతో వేతనాలు కాజేసినా.. తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా.. తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువగా చూపి నిధులు నొక్కేసినా ఈ సామాజిక తనిఖీ బృందాలు గుర్తించి తగిన చర్యలకు సిఫారసు చేస్తాయి. కానీ కంచే చేను మేసినట్లుగా తనిఖీ బృందాల్లోని కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో ఒక్కో పంచాయతీలో అక్కడ చేసిన పనుల విలువ ఆధారంగా గరిష్ఠంగా 3 లక్షల రూపాయల వరకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండ డంతో వీరి ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

NREGA Labour concerns: ఉపాధి హామీ సొమ్ము గోల్​మాల్ వ్యవహారంలో కొనసాగుతున్న కూలీల నిరసన

False Reports in Employment Guarantee Scheme Works: అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చిన చోట ఉపాధి పనుల్లో లోపాలపై సామాజిక తనిఖీ బృందాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తూతూమంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారు. అధికారులకు అనుమానం రాకుండా ఒకటి, రెండు పనుల్లో చిన్నచిన్న లోపాలున్నట్లు చూపించి మమ అనిపిస్తున్నారు. డబ్బులివ్వని ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం తనిఖీల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. కూలీల మస్టర్లలో దిద్దుబాట్లు ఉన్నాయని.. తక్కువ పని చేస్తే ఎక్కువగా చూపించారని తప్పుడు నివేదికలు రాస్తున్నారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఏడు రికార్డులు అందుబాటులో లేవంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు.

గతంలో సామాజిక తనిఖీలకు వెళ్లేటప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది భోజనం ఏర్పాటు చేసినా ఎస్​ఎస్​ఏటీ సిబ్బంది తిరస్కరించేవారు. వాళ్లే సొంతంగా వసతి ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ గత నాలుగేళ్లుగా తనిఖీ సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తమకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశిస్తున్నారు. పనులను తనిఖీ చేసి బహిరంగంగానే కమీషన్లు తీసుకుంటున్నారు. లక్ష రూపాయలు విలువైన పనికి రూ. 10 వేల చొప్పున ఇవ్వా ల్సిందేనని ఫీల్డ్ అసిస్టెంట్లను డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. కూలీల కష్టాన్ని దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్

Social Audit Teams Demand Bribes from Field Assistants: సామాజిక తనిఖీ బృందాల బెడద పడలేక ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి కమీషన్లు ముట్టజెబుతున్నారు. ఈ మొత్తం చిన్న పంచాయతీల్లో వేల రూపాయల్లో, పెద్ద పంచాయతీల్లో లక్షల్లో ఉంటోంది. అలా ఇచ్చిన సొమ్మును తిరిగి సంపాదించుకోడానికి కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. పర్యవసానంగా కూలీల హాజరు వ్యవహారంలో గోల్‌మాల్ జరుగుతోంది. ఉదాహరణకు ఒక బృందంలో ఇద్దరు, ముగ్గురు కూలీలు రాకపోయినా.. హాజరైనట్లు నమోదు చేస్తున్నారు. ఇలా కూలీల బ్యాంకు ఖాతాలకు జమయ్యే వేతనాల నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నారు. ప్రతి కూలీకి 250 రూపాయల కనీస వేతనం తప్పనిసరిగా వచ్చేలా చూడాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలున్నాయి. దీన్ని తమకు అనుగుణంగా మార్చుకుని కొందరు సిబ్బంది కూలీలతో తక్కువ విస్తీర్ణంలో పనులు చేయించి.. ఎక్కువ పని చేసినట్లు నమోదు చేయిస్తున్నారు. బదులుగా ఒక్కో కూలీ వేతనాల నుంచి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా తీసుకుంటున్న మొత్తాల నుంచే తనిఖీ బృందాలకు మామూళ్లు సమర్పించుకుంటున్నామని ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.