TRS MLAS PURCHASE CASE UPDATES: మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఫామ్‌హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని మరోసారి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఫామ్ హౌస్‌కు చేరుకొని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లోకి ఇతరులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.
ఈ స్థలంలో ఎక్కడైనా డబ్బులు దాచారా అన్న కోణంలో తనిఖీలను ముమ్మరం చేశారు. తమకు అనుమానంగా కనిపించిన ప్రతి చోటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు నిందితులను రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. ఈ నలుగురి ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీరి దగ్గర ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి కోర్టులో హాజరుపరచనున్నారు. సెల్‌ఫోన్లలో ఎవరేవరితో మాట్లాడారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులపై ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రివెన్సన్ ఆఫ్ కరెప్సన్ యాక్ట్ 8 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 120b కింద కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ముగ్గురు నిందితులను నేడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇవీ చదవండి: