రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఓటుహక్కు కల్పనపై.. గుంటూరు జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌వో) ఆ దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై రమేశ్‌కుమార్ కలెక్టర్‌కు అప్పీల్ చేశారు. ఎస్‌ఈసీ అప్పీల్ అందినట్లు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్(ఎఫ్‌ఏసీ) తెలిపారు. విచారణ అనంతరం ఓటుహక్కు కల్పనపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక