ETV Bharat / state

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి!.. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం - కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌

KS JAWAHAR AS NEW CS TO AP : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా.. ఆయనకు కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ పోస్టు ఇస్తారని సమాచారం.

KS JAWAHAR AS NEW CS TO AP
KS JAWAHAR AS NEW CS TO AP
author img

By

Published : Nov 26, 2022, 7:51 AM IST

NEW CS JAWAHAR REDDY : సమీర్‌ శర్మ పదవీ విరమణ తర్వాత.. 1990 బ్యాచ్‌ IAS అధికారి కేఎస్​ జవహర్‌రెడ్డిని నూతన సీఎస్‌గా నియమించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. 30వ తేదీతో సమీర్ శర్మ పదవీకాలం పూర్తికానుండగా.. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు.. అంటే మరో ఏడాదిన్నరపాటు సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.

కొత్త సీఎస్‌గా నియమితులు కానున్న జవహర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. జవహర్‌రెడ్డి కంటే సీనియర్లుగా ఉన్న 1987 బ్యాచ్‌ అధికారి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌, 1988 బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్ అధికారి కరికాల్‌ వలవన్‌.. సీఎస్‌ పోస్టును ఆశించారు. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం... జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపినట్టు తెలిసింది.

అప్పటినుంచి జవహర్​కే ప్రాధాన్యం: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జవహర్‌రెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే తితిదే ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే సీఎంవోకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం సీఎంవో వ్యవహారాలన్నీ జవహర్‌రెడ్డి కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని.. కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా సీఎస్‌ పోస్టులో నియమించాలన్న ప్రతిపాదనను ఒక దశలో పరిశీలించినట్లు తెలిసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు నలుగురు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. వారిలో ఒక్క L.V.సుబ్రహ్మణ్యం తప్ప.. మిగతా ముగ్గురూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అత్యంత విధేయంగా మెలిగారు. అసలు సీఎస్‌ పోస్టు అంటూ ఒకటి ఉందా అనే అనుమానం వచ్చేలా, సొంత నిర్ణయాలేమీ తీసుకోకుండా.. ముఖ్యమంత్రి కార్యాలయం ఏది చెబితే దానికి తలాడిస్తూ వచ్చారు.

పదవీ విరమణ తర్వాత కూడా కీలక పదవులు: ఆ విధేయతకు బహుమానంగా సర్వీసు ముగిశాక కూడా కొన్ని నెలల కొనసాగింపుతో పాటు, పదవీ విరమణ తర్వాత కీలక పోస్టులూ దక్కాయి. నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గాను, ఆదిత్యనాథ్‌ దాస్‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు. 2021 అక్టోబరు 10న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సమీర్‌శర్మ 2021 నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

సీఎం విజ్ఞప్తి మేరకు మొదట ఆరు నెలల, ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు కేంద్రం పొడిగింపునిచ్చింది. సీఎస్‌గా పదవీ విరమణ తర్వాత సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం.

కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.