OXYGEN MANUFACTURING : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021-22 ఆక్సిజన్ ఉత్పత్తి విధానం అమలుకు అనుమతి తెలియచేస్తూ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, సరఫరా కోసం ఆక్సిజన్ ఉత్పత్తి విధానానికి అనుమతి ఇస్తున్నట్టు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం మార్గదర్శకాలు జారీ చేశారు.
జోన్లవారీగా క్యాప్టివ్, నాన్ క్యాప్టివ్ విధానాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలకు అనుమతి మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. క్యాప్టివ్ మోడల్లో కొత్త ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల పరిధిలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. నాన్ క్యాప్టివ్ మోడల్లో ఉత్పత్తి చేసే లిక్విడ్ ఆక్సిజన్ , హీలియం ఆక్సిజన్ , పీఎస్ఏ టెక్నాలజీ ద్వారా ఆక్సిజన్ తయారీ యూనిట్ల సంఖ్యను ప్రభుత్వం నిర్దేశించింది. మరోవైపు ఆక్సిజన్ యూనిట్ల ఏర్పాటు కోసం అందించే ప్రోత్సాహకాలనూ ప్రకటించింది. ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలకు మూలధనంలో రాయితీతో పాటు 6 నెలలకు ఓ మారు విద్యుత్ వ్యయం రీఎంబర్సుమెంట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: