గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో ఈనాడు ,ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఖుద్దూస్ ఫౌండేషన్ సహకారంతో వనభారతి జన హారతి కార్యక్రమం నిర్వహించారు. మొక్కల ఆవశ్యకత గురించి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తహసీల్దార్ వెంకటేశ్వర్లు వివరించారు. అడవులు తగ్గిపోతున్నాయని....దీని వలన సకాలంలో వర్షాలు కురవడం లేదని, వాయు కాలుష్యం పెరిగిపోయిందని చెప్పారు. విద్యార్థులు ఇప్పటి నుంచే మొక్కలను నాటి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. మొక్కలతో విద్యార్థులు గ్రామ వీధుల్లో ప్రదర్శన చేశారు. అనంతరం 500 మొక్కలను పాఠశాల ఆవరణలో, దేవాలయాలు, రహదారుల వెంట నాటారు.
ఇదీ చదవండి