ETV Bharat / state

GMC: విచారణలో తేలిన చేతివాటాలు.. అధికారుల్లో చలనం! - గుంటూరులో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమంగా చేపట్టిన కట్టడాలుపై జీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇది ఓవైపైతే.. నిర్మాణాలు జరిగేంత వరకూ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

llegal constructions in guntur
విజిలెన్స్ విచారణల్లో తేలిన చేతివాటం...అధికారుల్లో చలనం
author img

By

Published : Sep 12, 2021, 10:36 PM IST

GMC: విచారణలో తేలిన చేతివాటం.. అధికారుల్లో చలనం!

అక్రమ కట్టడాలపై గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు ప్రారంభించారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు కార్యాచరణ సిద్ధం చేశారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రత ఆధారంగా కూల్చివేతలు చేపట్టారు. అయితే మరో వైపు నిర్మాణాలు జరుగుతున్నంత కాలం అధికారుల ఏం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపుగా 10లక్షల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం కూడా ఏటికేడు విస్తరిస్తోంది. కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఏ నిర్మాణానికైనా ప్రారంభానికి ముందే నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. భవన విస్తీర్ణం, అంతస్థుల ఆధారంగా పట్టణ ప్రణాళికా విభాగానికి ఫీజు చెల్లించాలి. కానీ కొందరు ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతుంటారు. వీటిలో చిన్నచిన్న గృహాల నుంచి బహుళ అంతస్థుల భవనాల వరకూ ఉంటాయి. ఇలాంటి వారి నుంచి ఫీజులు వసూలు చేయకుండా పట్టణ ప్రణాళికా విభాగం ఉద్యోగులు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణలు జరిగాయి.

ఈ విచారణల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఉద్యోగుల చేతివాటం నిజమేనని తేల్చారు. అలాంటి నిర్మాణాల జాబితాను ప్రభుత్వానికి కూడా పంపించారు. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల్లో చలనం వచ్చింది. అనుమతి లేకుండా కట్టిన భవనాల్ని తొలగిస్తున్నారు. నాలుగు అంశాల ఆధారంగా ప్రాధమ్యాలు నిర్ణయించి వివిధ దశల్లో తొలగించాలని నిర్ణయించారు. కనీసం ప్లాన్ కూడా లేకుండా నిర్మించిన కట్టడాలను మొదటి దశలో తొలగిస్తున్నారు. ఏసీబీ, విజిలెన్స్ నివేదికల్లోని భవనాలు ఈ విభాగంలో ఉన్నాయి. మరికొందరు ప్లాన్ ఉన్నా దాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం.. రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని అదనపు అంతస్థులు నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటికి సంబంధించి రెండో ప్రాధాన్యంగా కూల్చివేతలు చేపట్టారు. రహదారులపైకి ప్రహారీ గోడలు, మెట్లు నిర్మాణం వంటివి మూడో ప్రాధాన్యంగా చేర్చారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

"అనుమతులు తీసుకోని నిర్మాణాలు, ప్లాన్ ఉన్నా దాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వాటిని గుర్తించాం. ఏసీబీ ఇచ్చిన నివేదికలోని నిర్మాణాలను కూడా గుర్తించాం. అవసరమైతే పోలీసు వారి సాయం కూడా తీసుకుని నిర్మాణాలను కూల్చివేత, చర్యలు తీసుకుంటాం. నోటీసులు పంపుతాం.సిబ్బందికి కూడా సూచనలు చేశాం. " - చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ

" బిల్డింగ్ ఇస్పెక్టర్లు, లైసెన్స్డ్ ఇంజినీర్ల మాటలు నమ్మి పొరబాటున కూడా తప్పుగా నిర్మాణాలు చేయొద్దు. సిన్సియర్ అధికారులు వస్తే ఇలాంటి చర్యలు తప్పవు. కాబట్టి చట్ట ప్రకారం నిర్మించుకోవాలి. " - వేములపల్లి శ్రీరాం, తెదేపా కార్పోరేటర్

నగరంలో కొత్త నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే వాటికి అనుమతి తీసుకున్నారా లేదా అనేది తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ సరిగా జరగటం లేదు. కొన్నిసార్లు నిర్మాణాలు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు పట్టించుకోరు. భవన యజమానుల నుంచి ఎంతోకొంత తీసుకుని మౌనం వహిస్తున్నారు. తీరా నిర్మాణం పూర్తయిన తర్వాత అనుమతులు లేవని కూల్చివేతలకు దిగటం కచ్ఛితంగా అధికారుల వైఫల్యమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రస్తుతం వార్డు సచివాలయావల వారీగా ప్లానింగ్ కార్యదర్శులున్నారు. నగరంలోని 207 సచివాలయాల్లోనూ వీరు విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ పరిధిలో జరిగే నిర్మాణాలపై వెంటనే తనిఖీ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే మొదట్లోనే అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టవచ్చు. వారు చట్టబద్ధంగా అనుమతులు తీసుకునేలా చూడటం ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం పెరిగే అవకాశముంది. ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఈ విషయంపై దృష్టి సారించారు. అక్రమ నిర్మాణాలు ఎవరి పరిధిలో జరిగాయో వారిపైనా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్ఛరిస్తున్నారు. నిర్మాణాలు చేపట్టేవారు కూడా తగిన అనుమతులు తీసుకోవాలని కమిషనర్ సూచిస్తున్నారు. లేకపోతే కూల్చివేతలు, జరిమానాలు తప్పవంటున్నారు. కొందరు అధికారులు అవినీతి వ్యవహారాలతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీపీఎస్ వస్తుందని చెప్పి కొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రణాళికా విభాగం అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పుడే అడ్డదిడ్డంగా నిర్మాణాలు జరక్కుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే తనిఖీలు నిర్వహిస్తే కూల్చివేతల చేపట్టాల్సిన అవసరం ఉండదు.

ఇదీ చదవండి: BABY DEAD: ఆడుకుంటుండగా ప్రమాదం... గేటు మీద పడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.