Illegal activities at anna canteen: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని అన్న క్యాంటీన్ భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. రూ.5కే పేదల కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారాక వాటిని మూసేశారు. చాలాచోట్ల ఆ భవనాలను గ్రామ సచివాలయాలుగా వాడుకుంటున్నారు. వదిలేసిన కేంద్రాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉండవల్లి కేంద్రంలో మద్యం తాగి ఖాళీ సీసాలను అక్కడే పడేస్తున్నారు. క్యాంటీన్ లోపల, ఆవరణలో తాగి పడేసిన మద్యం సీసాలే కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి: