ETV Bharat / state

IIT MAINS RANK: ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో గుంటూరు విద్యార్థికి 10వ ర్యాంకు - ఐఐటి అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. నిరంతర శ్రమతోనే ఇది సాధ్యమైందని విద్యార్థి హృషికేష్ అంటున్నాడు. పండుగ రోజు ఫలితాలు రావడంపై వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.

IIT MAINS RANK
IIT MAINS RANK
author img

By

Published : Oct 15, 2021, 7:28 PM IST

ఐఐటి అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో గుంటూరు విద్యార్థికి 10వ ర్యాంకు

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థి హృషికేష్ రెడ్డి సత్తా చాటాడు. అంకిరెడ్డిపాలేనికి చెందిన బ్యాంకు ఉద్యోగులు జగదీశ్వరరెడ్డి, శ్రీదేవిల రెండో కుమారుడు హృషికేష్ రెడ్డి జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. రోజూ 14 గంటల పాటు కష్టపడిన ఫలితంగా ఈ ర్యాంకు సాధించినట్లు హృషికేష్ రెడ్డి తెలిపారు.

ఇంటర్మీడియట్ సబ్జెక్టులతో పాటు ఐఐటీకి సంబంధించిన అంశాలను ప్రణాళికాబద్ధంగా చదివానన్నారు. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులో చేరతానని హృషికేష్ తెలిపారు. ఉద్యోగిగా కాకుండా పది మందికి ఉపాధి కల్పించటమే లక్ష్యంగా చదువు సాగిస్తానని అన్నాడు. 10వ తరగతి వరకూ కేకేఆర్ గౌతం స్కూల్లో, ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యలో చదివినట్లు తెలిపాడు. చిన్నప్పటి నుంచి తమ అబ్బాయికి చదువంటే ఇష్టమని తండ్రి జగదీశ్వరరెడ్డి చెబుతున్నారు. ఇంటర్​లో 982 మార్కులు, ఎంసెట్​లో 25వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. విజయదశమి రోజున ర్యాంకు రావటం పండుగ సంతోషాన్ని రెట్టింపు చేసిందని విద్యార్థి తల్లి శ్రీదేవి అన్నారు.

ఇదీ చదవండి: దాండియాతో హోరెత్తించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.