మనస్పర్థల కారణంగా భార్యని భర్త గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన గుంటూరు తుఫాన్ నగర్లో జరిగింది. గుంటూరుకి చెందిన వీరాంజనేయులుతో కృష్ణా జిల్లా కంచికచర్లకి చెందిన కొటేశ్వరితో 15 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరాంజనేయులు కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 8 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే గత నాలుగు నెలలు నుంచి ఇరువురి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి భార్యతో గొడవ పడిన వీరాంజనేయులు కోపంతో భార్యను ఒక్కసారిగా తోసేశాడు. అనంతరం గొంతు పిసికి చంపినట్లు మృతురాలి తండ్రి ప్రతాప్ తెలిపాడు. తన కూతురుని చంపిన అల్లుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టాభిపురం సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు.
ఇవీ చదవండి