ETV Bharat / state

భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు - గుంటూరు జిల్లా నేర వార్తలు

కట్టుకున్న భార్య నగ్న వీడియోలు, ఫొటోలను అంతర్జాలంలో పెట్టి వ్యాపారం చేస్తున్నాడు ఓ నీచుడు. పరాయి పురుషుల వద్దకు వెళ్లమని ఒత్తిడి చేశాడు. భరించలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు విశ్వసనీయ సమాచారం.

husband harassment with wife nude videos
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం దిశ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
author img

By

Published : Nov 23, 2020, 1:32 PM IST

Updated : Nov 23, 2020, 2:56 PM IST

గుంటూరుకు చెందిన ఓ యువతిని మూడేళ్ల కిందట నగరానికే చెందిన యువకుడు తాను ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగినంటూ నమ్మించి భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకొని వివాహం చేసుకున్నాడు. వివాహమైనప్పటి నుంచి తనకు ఎయిర్‌పోర్టు, విమానాలు చూపించాలని భార్య భర్తను కోరింది. అప్పుడు అసలు అతనికి ఎలాంటి ఉద్యోగం లేదని తెలిసి మోసపోయిన విషయం అర్థం చేసుకుంది. ఈ విషయమై ఇరు కుటుంబాల్లో కొంత మనస్పర్థలు వచ్చినా అమ్మాయి కాపురం నిలబడాలని సర్ది చెప్పగా.. భార్యాభర్తలు కలసి ఉంటున్నారు. ఆ యువకుడు ఓ కొరియర్‌ సంస్థను పెట్టి నగదు నష్టపోయాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులువుగా డబ్బులు సంపాదించడానికి నీఛపు పనులకు దిగాడు.

కొద్దిరోజుల క్రితం పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని భర్త ఒత్తిడి చేయటంతో ఆమె నిర్ఘాంతపోయింది. తాను చెప్పినట్లు వినకపోతే చనిపోతానంటూ తలను గోడకు వేసుకొని కొట్టుకుంటూ బెదిరించటంతో ఏడ్చుకుంటూ దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. భర్త వికృతంగా వేధిస్తున్నాడంటూ చెప్పడమే తప్ప మిగిలిన విషయాలు చెప్పడానికి సంకోచించింది. ఈ విషయం తెలిసిన గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు చేయాలని డీఎస్పీ సుప్రజను ఆదేశించారు. డీఎస్పీ ఆమెను ఓదార్ఛి..అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ బాధితురాలు.. తన భర్త వేధిస్తున్న తీరును డీఎస్పీకి వివరించింది.

భర్తను పిలిచి డీఎస్పీ లోతుగా దర్యాప్తు చేపట్టారు. కొంత కాలంగా తన భార్యకు తెలియకుండా ఆమె నిద్రపోతున్నప్పుడు నగ్న ఫొటోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడని, ఎక్కువ మంది ఆ వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయని పోలీసులకు చెప్పాడని సమాచారం. అంతేకాకుండా ఏకాంతంగా గడిపిన వీడియోలను కొత్తగా వచ్చిన యాప్‌ల ద్వారా లైవ్‌గా పెట్టి భర్త తన బ్యాంకు ఖాతాకు నగదు జమచేయించుకునే వాడని తెలిసింది. అలా యూట్యూబ్‌, యాప్‌లలో లైవ్‌ల ద్వారా సంప్రదించిన వారి వద్దకు ఆమెను పంపించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే నికృష్టపు ఆలోచన చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా తన భార్యను పరాయి పురుషుల వద్దకు వెళితే డబ్బులు వస్తాయని, అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడని గుర్తించారు. అతను పెట్టే మానసిక క్షోభను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని సైబర్‌ నిపుణులను రంగంలోకి దించారు. ఆ యువతి పరువు కాపాడేందుకు ఇప్పటివరకు భర్త అంతర్జాలంలో పెట్టిన ఫొటోలు, వీడియోలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయమై అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డిని సంప్రదించగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై దిశ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణ ముగిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:

మాచర్లలో గడియార స్తంభం కూల్చేసిన అధికారులు

Last Updated : Nov 23, 2020, 2:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.