గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యపై భర్త దాడి చేశాడు. భార్యపై అనుమానంతో కత్తితో పొడిచాడు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన నాగరాణి, యెహోను భార్యాభర్తలు.
అనారోగ్యం కారణంగా.. చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది నాగరాణి. అయితే.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త యెహోను.. ఆసుపత్రిలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం నాగరాణి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: