గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కరోనా ప్రభావంతో ప్రజలు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం చార్జీలు పెంచడం సరికాదని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కమతం సాంబశివరావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను విక్రయించే ఆలోచనలు ప్రభుతం విరమించుకోవాలని సూచించారు.
మద్యపానం పూర్తిగా నిషేధించాలని...ఉపాధి కోల్పోయిన భవన, చేతి వృత్తుల కార్మికులకు లాక్డౌన్ సమయంలో 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలస కార్మికులను ఆదుకునేలా చర్యలు తీసుకుని.. ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇది చదవండి అగ్రరాజ్యం నేవీలో.. తెలుగు తేజం