Houses demolished: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో.. రహదారుల విస్తరణ పేరుతో పంచాయతీ అధికారులు ఇళ్లను కూల్చివేశారు. ముందస్తు సమాచారం లేకుండానే అధికారులు తమ ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు వాపోయారు.
తాము తెదేపాకు ఓటు వేశామన్న అక్కసుతోనే స్థానిక సర్పంచి తమ ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పంచాయతీ కార్యాలయం సైతం చెరువు పోరంబోకు స్థలంలో ఉందని.. దానిని కూడా కూల్చివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఉన్నపళంగా తమ ఇళ్లను కూల్చివేయడంతో నిలువు నీడ లేకుండా రోడ్డున పడ్డామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: Dilapidated Bridges : శిథిలావస్థలో వంతెనలు.. ప్రమాదం అంచున ప్రయాణాలు..