తమకు ఇళ్ల స్థలాలు ఎందుకు కేటాయించలేదని అధికారులు, నాయకులను కాకుమానులో కొంతమంది గ్రామస్థులు ప్రశ్నించారు. వైకాపా నాయకుడు భద్రయ్య సమస్యను తెలిపేందుకు హోంమంత్రి సుచరిత వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సమస్య వివరాలు చెప్పాలని కోరగా అయినా పోలీసులు నిరాకరించడంతో అతను ముందుకు వెళ్ళాడు. పోలీసులు నాయకుడి చొక్కా పట్టుకుని వెనక్కి లాగి పక్కకు తోశారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని.. తమకు ఎందుకు ఇవ్వలేదని.. హోంమంత్రికి సమస్య తెలిపేందుకు వెళ్లనీయకుండా పోలీసులు తాడు అడ్డుగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోపణలు చేయకండి
స్థలాలు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకునే వెళ్తానని హోంమంత్రి సుచరిత చెప్పారు. కొన్ని నిబంధనలు ఉంటాయని... స్థలం ఎందుకు రాలేదో... తెలుసుకోకుండా మొండిగా ఆరోపణలు చేయవద్దన్నారు. నివేశన స్థలాల జాబితాను అధికారులు సచివాలయంలో ప్రచురించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్