గుంటూరు జిల్లా కాకుమానులో వైఎస్సార్ ఆసరా పథకాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 65వేల కోట్ల సంక్షేమ పథకాల కింద ప్రజలకు ఇచ్చినట్లు వెల్లడించారు. విడతల వారీగా డ్వాక్రా రుణాల మాఫీ జరుగుతుందని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి... ఆచరణలో చూపలేదని ఆరోపించారు. రుణమాఫీ జరుగుతుందని నమ్మి మహిళలు బ్యాంకులకు నగదు కట్టడం ఆపారని... ఫలితంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇదీ చదవండీ... కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ