ETV Bharat / state

మహిళలకు అండగా నిలుస్తాం: హోంమంత్రి సుచరిత

దిశ వంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా గట్టి చర్యలు చేపడతామని... మహిళలు, బాలికలకు అండగా నిలుస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని... పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీఇచ్చారు.

మహిళలకు అండగా నిలుస్తాం:సుచరిత
మహిళలకు అండగా నిలుస్తాం:సుచరిత
author img

By

Published : Dec 3, 2019, 10:40 PM IST

మహిళలకు అండగా నిలుస్తాం: హోంమంత్రి సుచరిత

అతివల భద్రతకు మహిళా మిత్ర తెచ్చామని హోంమంత్రి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన మహిళా మిత్ర కార్యక్రమానికి హోంమంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సదస్సులో రక్షణపై మ‌హిళ‌ల్లో చైత‌న్యం, పోలీసుల సాయం పొందడంపై గుంటూరు గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

మంత్రులు శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు విడదల రజనీ, అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా ఎస్పీ విజయరావు పాల్గొన్నారు. మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... మహిళా సాధికారిత దిశగా మంత్రివర్గ కూర్పులోనూ పెద్దపీట వేసిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు.

ఇదీ చదవండి: ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి!

AP_GNT_05_03_MINISTERS_ON_MAHILA_MITRA_AVB_3067949_AP10027 REPORTER: P.SURYA RAO & MALLIKARJUNARAO(CHILAKALURIPETA) CAMERA: ALI NOTE: 3G ద్వారా విజువల్స్, బైట్స్ వచ్చాయి. పరిశీలించగలరు. ( ) దిశ వంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా గట్టి చర్యలు చేపడతామని... మహిళలు, బాలికలకు అండగా నిలుస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని... పోలీసు యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మహిళా మిత్ర కార్యక్రమానికి హోంమంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలు పెద్దఎత్తున హాజరైన ఈ సదస్సులో రక్షణపై మ‌హిళ‌ల్లో చైత‌న్యం, పోలీసుల సాయం పొందడంపై గుంటూరు గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు శ్రీరంగనాధ రాజు, మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు విడదల రజనీ, అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా ఎస్పీ విజయరావు పాల్గొన్నారు. మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.... మహిళా సాధికారిత దిశగా మంత్రివర్గ కూర్పులోనూ మహిళలకు పెద్దపీట వేసిన విషయాన్ని సుచరిత గుర్తు చేశారు. ఘటన జరిగినప్పుడే కాకుండా నిరంతరం మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీరంగ నాధరాజు అభిప్రాయపడ్డారు. చట్టాలే కాదు.. సమాజం మహిళలకు అండగా నిలవాలని మంత్రి మోపిదేవి పిలుపునిచ్చారు....BYTES... BYTE: మేకతోటి సుచరిత, హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి BYTE: మోపిదేవి వెంకటరమణ, మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రి BYTE: చెరకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.