గుంటూరు జిల్లాలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. దుగ్గిరాల మండలం దేవురపల్లి అగ్రహారంలో ఈ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఉపసభాపతి కోన రఘుపతితో పాటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.
సర్వే జరిగే తీరును పర్యవేక్షించేందుకు.. అధికారులు డ్రోన్లను ఉపయోగించనున్నారు. జీపీఎస్ వంటి ఆధునిక సాంకేతికతను సర్వేలో వినియోగించడం ద్వారా భూముల లెక్కలు పక్కాగా ఉంటాయని నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: అనపర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం