మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడాలని హోంమంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. గుంటూరు నగరం పాలెంలోని మహిళా పోలీస్ స్టేషన్ను హోంమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. తన కేసు విషయమై పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ ఆరోపించగా.... సదరు అధికారిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్కు వచ్చిన బాధితులను పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. తక్షణం ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించారు. పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలని ఆదేశించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అవసరం
దేశమంతటా మహిళా భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో... రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలని హోమంత్రి సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించకూడదని...ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టె ఉంచే యోచన చేస్తున్నామన్న హోంమంత్రి... తగినంత సిబ్బంది లేనప్పటికీ మహిళా పోలీసు స్టేషన్లలో మహిళా అధికారులనే నియమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: