కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాకతో చెక్ పెట్టారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని తెలిపారు. కోవాగ్జిన్, కోవిషిల్డ్ వ్యాక్సిన్ లు రాష్ట్రంలో మొదటి విడత కింద ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 31 కేంద్రాలలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి