ETV Bharat / state

High Court verdict: కుమార్తెలకు సమానంగా వారసత్వపు హక్కు కేసులో హైకోర్టు కీలక తీర్పు... - hc

Property Rights of Daughter: తండ్రి ఆస్తిలో కుమారులతోపాటు కుమార్తెలకు సమానంగా వారసత్వపు హక్కు ఉంటుందని హైకోర్టు మరో మారు స్పష్టంచేసింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలులోకి రాకపూర్వం తండ్రి మరణించారా లేదా అనే విషయంతో సంబంధం లేదని కోర్టు తీర్పులో పేర్కొంది. పుట్టుకతోనే ఆస్తిలో వారసత్వంగా కుమార్తెలు వాటా హక్కుదారులని తెలిపింది.

Property right For Daughter
Property right For Daughter
author img

By

Published : Jun 17, 2023, 10:45 PM IST

Updated : Jun 18, 2023, 6:45 AM IST

daughters will have equal rights in parental property: హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలులోకి రాకపూర్వం తండ్రి మరణించారా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా తండ్రి ఆస్తిలో కుమారులతోపాటు కుమార్తెలకు సమానంగా వారసత్వపు హక్కు(ఆస్తుల విభజన జరగని కేసుల్లో) ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. వినీత శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పేర్కొందని తెలిపింది. ఈ చట్ట నిబంధనలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థిస్తూ విచారణ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని ముగ్గురు కుమార్తెలకు హైకోర్టు సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి ఈనెల 13న ఈమేరకు తీర్పు ఇచ్చారు.

  • AP HC New Chief Justice: ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ శేషసాయి..
    తన తండ్రి తురగ రామమూర్తికి చెందిన ఉమ్మడి ఆస్తి నుంచి తనకు రావాల్సిన వాటా ఇచ్చేందుకు తన సోదరులు, సోదరిలు నిరాకరిస్తున్నారని ఆనందరావు తెనాలి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో 1986లో దావా వేశారు. రామమూర్తి కుమార్తెలు అచ్యుతుని సీతారావమ్మ మరో ఇద్దరు.. ఆ దావాలో అనుబంధ పిటిషన్‌ వేస్తూ హిందూ వారసత్వ(సవరణ) చట్టం-2005 ప్రకారం తమకు సమాన వాటా దక్కేలా తుది తీర్పు ఇవ్వాలని కోరారు. 2009 ఆగస్టులో అందుకు న్యాయస్థానం అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. పుట్టుకతోనే ఆస్తిలో వారసత్వంగా కుమార్తెలు వాటా హక్కుదారులని తెలిపింది. ఆ ఉత్తర్వులను ‘సమీక్షించాలని’ కోరుతూ రామమూర్తి మరికొందరు కుమారులు, వారి వారసులు తెనాలి కోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అదే ఏడాది సెప్టెంబర్‌ 09వ తేదీన అమలులోకి వచ్చిందన్నారు. ఆ చట్టం అమల్లోకి వచ్చాక ఎవరైతే చనిపోయారో ఆతని ఆస్తి నుంచి వారసత్వ హక్కు కుమార్తెలకు దఖలు పడుతుందన్నారు. అంతేతప్ప ఆ చట్టాన్ని పూర్వం నుంచి వర్తింపచేయడానికి వీల్లేదన్నారు. తమ తండ్రి తురగ రామమూర్తి 1961 జులై 17న కన్నుమూశారని తెలిపారు. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 లేదా ఏపీ సవరణ చట్టం(యాక్ట్‌ 13/1986) ఆస్తి వాటా విషయంలో కుమార్తెలకు వర్తించదన్నారు. సవరణ చట్టం అమలులోకి రాకపూర్వమే వారికి వివాహం జరిగిందన్నారు.
  • ప్రస్తుతం జోక్యం చేసుకోలేం.. జీవో నెంబర్​ 1​పై సుప్రీంకోర్టు
    ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ కుమార్తెలు ముగ్గురు అదే ఏడాది హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చింతలపాటి పాణిని సోమయాజీ వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సవరణ చట్టం-2005 సెక్షన్‌ 6(1) ప్రకారం కుమార్తె పుట్టుకతోనే ఆస్తివాటాలో వారసత్వ హక్కుదారులన్నారు. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005 సెప్టెంబర్‌ 9వ తేదీ నాటికి తండ్రి మరణించారా? లేదా అనేదానితో సంబంధం లేకుండా అవిభాజ్య హిందూ కుటుంబం(హెచ్‌యూఎఫ్‌) ఆస్తుల విషయంలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుందని ‘వినీత శర్మ’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం తెలిపిందన్నారు. సవరణ చట్టం అమల్లోకి వచ్చాకే తండ్రి ఉమ్మడి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా హక్కు కల్పించడాన్ని పరిమితం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో హిందూ వారసత్వ సవరణ చట్ట నిబంధనలను పూర్వ నుంచే వర్తిస్థాయని చెప్పడానికి తాము సంశయించడం లేదని స్పష్టంచేశారు. హిందూ వారసత్వ సవరణ చట్టం నిబంధనలకు అనుగుణంగా తుది తీర్పు ఇచ్చేందుకు అభ్యర్థన చేస్తూ తెనాలి కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని ముగ్గురు కుమార్తెలైన పిటిషనర్లను సూచించారు.

Last Updated : Jun 18, 2023, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.