High Court judge visited Gandikota: ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన గండికోటను హైకోర్టు న్యాయమూర్తి రమేశ్ సందర్శించారు. జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫక్రుద్దీన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. సాయంత్రం 4గంటల తర్వాత జడ్జి రమేశ్ దంపతులు గండికోట అందాలను తిలకించారు. ముందుగా రోప్ వే సమీపంలోని పెన్నా లోయను పరిశీలించి, సాహస క్రీడల అకాడమీ ఏర్పాటు చేసిన నిచ్చెనపై తిరిగారు. అనంతరం కోటలోని ఎర్ర కోనేరు, మసీదు, ధాన్యాగారం, పెన్నాలోయలను తిలకించారు. మధ్యాహ్నం ఒంటిమిట్టకు చేరుకుని కోదండ రామస్వామిని దర్శించుకుంటారని కోర్టు వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: