Bar Association Elections: ఏపీ హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సాయికుమార్ గెలుపొందారు. ఆయన మొత్తం 703 ఓట్లు పొందారు. అధ్యక్షుడి పదవికి బరిలో ఉన్న సీనియర్ న్యాయవాది వి.వేణుగోపాలరావుకు 683 ఓట్లు రాగా, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాదబాబుకు 38 ఓట్లు పొందారు. జానకీరామిరెడ్డి, వేణుగోపాలరావు మధ్య హోరాహోరా పోటీ జరిగింది. అంతిమంగా 20 ఓట్ల మెజారిటీతో జానకిరామిరెడ్డి గెలుపొందారు. ఇప్పటి వరకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకిరామిరెడ్డి కొనసాగారు. కాలపరిమితి ముగియడంతో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు.
ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేశ్ కుమార్ గెలుపొందారు. ఆయనకు 739 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి జి తుహిన్ క్కుమార్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ గెలుపొందారు. ఆయనకు 780 ఓట్లురాగా సమీప అభ్యర్థి టి సింగయ్యగౌడ్కు 630 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా ఎం సాల్మన్ రాజు గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా మిత్తిరెడ్డి జ్ఞానేశ్వరరావు, కోశాధికారిగా బీవీ అపర్ణ లక్ష్మి గెలిచారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా పితాని చంద్రశేఖర్రెడ్డి గెలుపొందారు. మహిళా ప్రతినిధిగా రేవనూరు సుధారాణి ఏకగ్రీవమయ్యారు.
కార్యనిర్వహణ సభ్యులుగా అన్నం శ్రీధర్, కార్యనిర్వహణ సభ్యులు డి మారుతి విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మహిళ సభ్యులుగా కాశీ అన్నపూర్ణ గెలుపొందారు. ఈసీ సభ్యులుగా 12మంది బరిలో ఉండగా.. అందులో నలుగురు ఎంపికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ఎం విజయకుమార్ వ్యవహరించారు.
241 పోస్టులను భర్తీ: హైకోర్టులోని పలు విభాగాల్లో 241 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను హైకోర్టు ప్రకటించింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు హైకోర్టు వెబ్సైట్లో ఉంచింది. రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్ ఆలపాటి గిరిధర్ ఫలితాలను ప్రకటించారు. రాతపరీక్షలో ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) ముందు హాజరు అయ్యేందుకు వివిధ తేదీలను తెలిపారు. హైకోర్టులో 241 పోస్టుల భర్తీ కోసం 2022 అక్టోబర్ 21న ప్రకటనలు వెలువడింది. సెక్షన్ ఆఫీసర్ 09, అసిసెంట్ సెక్షన్ ఆఫీసర్ 13, కంప్యూటర్ ఆపరేటర్స్ 11, ఓవర్ సీర్ 01, అసిస్టెంట్ 14, ఎగ్జామినర్ 13, టైపిస్ట్ 16, కాపీయిస్టు 20, అసిస్టెంట్ ఓవర్ సీర్ 01, డ్రైవర్లు 08, ఆపీసు సబార్డినేట్లు 135, మొత్తం 241 పోస్టులను భర్తీ చేశారు.
ఇవీ చదవండి: