ETV Bharat / state

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తత అనివార్యం : పవన్‌ - power star on corona

pawan kalyan awareness on Corona: కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్నందున.. ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ సూచించారు. యావత్ ప్రజానీకం భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు.. తప్పనిసరిగా మాస్క్ వాడాలని కోరారు. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.

pawan kalyan awareness on Corona
pawan kalyan awareness on Corona
author img

By

Published : Jan 10, 2022, 3:38 PM IST

pawan kalyan awareness on Corona: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ అన్నారు. వైద్య నిపుణుల సూచనలు అనుసరించాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు... తప్పనిసరిగా మాస్క్ వాడాలని సూచించారు. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రాబోయే సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మహమ్మారిని పారదోలాలని అన్నారు.

ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి..
కరోనా సెకండ్​వేవ్​లో మందులు, ఆక్సిజన్ దొరకక ప్రజలు అల్లాడిపోవడం సహా ఎందరినో కోల్పోయామని... ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను జనసేనాని కోరారు.

ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు టీకా తీసుకోనివారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కోరారు. ముఖ్యంగా జనసైనికులు, వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనాతో ఆపదలో ఉన్నవారిని ఎప్పటిలాగే ఆదుకోవాలని... ఈ క్రమంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

ఇదీ చదవండి: Night Curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ.. మాస్కు ధరించకపోతే జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.