ETV Bharat / state

Nagarjuna: మా అందరి కోసమే సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం: నాగార్జున - nagarjuna on chiranjeevi meeting with cm jagan news

hero nagarjuna news
hero nagarjuna news
author img

By

Published : Jan 13, 2022, 12:49 PM IST

Updated : Jan 13, 2022, 1:10 PM IST

12:46 January 13

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున

Nagarjuna respond on CM Jagan-Chiranjeevi meet: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. మా అందరి కోసమే చిరంజీవి.. జగన్‌తో సమావేశం అవుతున్నారని చెప్పారు. సినిమా విడుదల ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని వెల్లడించారు. జగన్‌తో సమావేశం ఉంటుందని వారం క్రితమే చిరంజీవి చెప్పారని పేర్కొన్నారు. చిరంజీవి తన ఒక్కరి కోసం వెళ్లటం లేదని స్పష్టం చేశారు. సీఎంతో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

సీఎంతో చిరంజీవి భేటీ..

cm ys jagan - chiranjeevi: కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్​తో.. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఇప్పటికే గన్నవరం చేరుకున్న చిరంజీవి.. ముఖ్యమంత్రి ఇంటికి చేరుకోనున్నారు. సీఎం ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చినట్లు చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమ బిడ్డగా సీఎంతో మాట్లాడతానన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు చర్చిస్తానని.. భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.

రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం తారాస్థాయికి చేరింది. గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చులోనే పేదలకు వినోదం అందాలన్నది ప్రభుత్వ వైఖరి అని మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్​ను కలవటంపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

ఇదీ చదవండి

సీఎం జగన్​తో చిరంజీవి భేటీ

Last Updated : Jan 13, 2022, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.