Hello Lokesh Program with Students And Youth : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డాన్ బాస్కో పాఠశాలలో "హలో లోకేశ్(Hello Lokesh)" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. యువత బంగారు భవిష్యత్తుకు తాను భరోసా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Nara Lokesh Face to Face with Students and Youth : దేశమంతా గొప్పగా చెప్పుకునే ఏపీ.. ఇప్పుడందరికీ చులకనైందన్నారు. నారా చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు కావాలా?.. అమరావతి రాజధాని కావాలా?.. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా?.. రూ.50 వేల జీతం తీసుకుంటారా? అని విద్యార్థులను, యువతను ప్రశ్నించారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువతే నిర్ణయించుకోవాలని లోకేశ్ అన్నారు.
ఏటా జాబ్ క్యాలెండర్ : నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇంకో 9 నెలలు ఓపిక పట్టండి.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేశామని అన్నారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని.. ఏటా జాబ్ క్యాలెండర్(Every Year Job Calendar) ఇస్తామని హామీ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. జాబ్ రెడీ యూత్‌ని తయారు చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ గుర్తు చేశారు.
AP JOB Calendar: ప్రతిపక్షంలో జాబ్ క్యాలెండరంటూ.. అధికారంలో ఉద్యోగాల భర్తీ ఊసేలేదు
పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి ఉపాధి కోసం వస్తారు : అమర రాజా కంపెనీని తెలంగాణకు పంపించేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, ఉపాధి కోసం ఎవరూ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా చూస్తామన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చేలా చేస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే టీడీపీ టార్గెట్ తెలిపారు. ప్రజా సమస్యలపై యువత కూడా పోరాటం చేయాలని నారా లోకేశ్ సూచించారు.
పాత విధానంలోనే ఫీజురియంబర్స్మెంట్ అమలు చేస్తాం : తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తామని తెలిపారు. వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన వల్ల 2 లక్షల మందికి మార్క్‌లిస్ట్ రాలేదని.. టీడీపీ అధికారం చేపట్టాక కళాశాలలకే నేరుగా ఫీజులు చెల్లిస్తామని భరోసా కల్పించారు.
టీడీపీ అధికారంలో ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా ఇచ్చే వాళ్లని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యా దీవెన సరిగా లేకపోవడంతో అమలు కావటం లేదని ఆరోపించారు. ఇప్పుడు కేవలం రెండు లక్షల మందికి మాత్రమే విద్యా దీవెన ఇస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధాన తెస్తామన్నారు. తాము వచ్చిన వంద రోజుల్లోనే మెడికల్ పేమెంట్ సీట్ల విధానం రద్దు చేస్తామన్నారు.
చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి : వైసీపీ పాలనలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ అందరూ రాజకీయ సిఫార్సులతో వచ్చారని ఆరోపించారు. కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడనని ముఖ్యమంత్రి చెప్పే మాటలు అబద్ధాలని అన్నారు. చేతల్లో మాత్రం ప్రతి విషయంలో కులం, మతం, పార్టీ చూస్తున్నారని అన్నారు. వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు మళ్లీ తెచ్చేలా చూస్తామని అన్నారు. అమరావతిలో రోడ్లు సరిగాలేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు అడగగా.. తాము వచ్చాక మళ్లీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేస్తామన్నారు. తనది కాలేజ్ లైఫ్.. జగన్‌ది జైల్ లైఫ్ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి.. రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నిర్భయ కింద కేసు పెట్టరు.. కానీ దిశ చట్టంతో శిక్షలు వేస్తారట అని ఎద్దేవా చేశారు. మహిళలు ధైర్యంగా బయట తిరిగే పరిస్థితి తెస్తామన్నారు.
ఎవరినీ వదిలిపెట్టను : జగన్‌కు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని లోకేశ్ అన్నారు. అలా మాట్లాడాకే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చారని, అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు.. రాష్ట్రాభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తన తల్లిని కూడా అవమానించారని, అదే తనలో కసి పెంచిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనలో ఎన్ని అవమానాలైనా భరిస్తానని అన్నారు. తన తల్లి జోలికి వచ్చిన వారి తోలుతీస్తానని, ఎవరినీ వదిలిపెట్టనని లోకేశ్ తెలిపారు.
గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని తాను లక్ష కోట్లు సంపాదించలేదని తెలిపారు. పనికిమాలిన మద్యం బ్రాండ్లను ప్రజలతో తాగిస్తున్నారనీ, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
Nara Lokesh Yuvagalam padayatra in Mangalagiri: జన మంగళగిరి.. అట్టహాసంగా లోకేశ్ యువగళం పాదయాత్ర