Heavy rains in Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్లు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు కొనసాగనున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో మోస్తారు నుంచి విస్తారంగా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి వల్ల రాష్ట్రంలోని పలు చోట్లు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా-చత్తీస్గఢ్ మీదుగా మళ్లే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉత్తరప్రదేశ్ వరకూ ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
అటు నైరుతి రుతుపవనాలు కూడా క్రియాశీలకంగా ఉన్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణా సహా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నట్టు ఐఎండీ వివరించింది. అల్పపీడన ప్రాంతం ప్రభావంతో రాగల 24 గంటల పాటు తెలంగాణా, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు సెప్టెంబరు 10తేదీ వరకు కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోనూ విస్తారంగా వానలు పడతాయని ఐఎండీ తెలియజేసింది.
విజయవాడలో వాన: విజయవాడ నగరంలో బుధవారం సాయంత్రం వర్షం పడగా.. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొన్ని చోట్ల వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదనీరు పొంగి రోడ్లపై ప్రవహించటంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మ్యాన్ హోల్స్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ, గన్నవరం, పెనమలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మరమ్మతు పనులకు ఆటంకం కలిగింది. కేసరపల్లి, గన్నవరం ప్రాంతంలో వాహనల రాకపోకలకు ఆటకం కలిగింది.
Boy Was Dead in Culvert at Hyderabad : బాచుపల్లి వద్ద నాలాలో గల్లంతైన బాలుడు మృతి..
ఉమ్మడి కృష్ణా జిల్లాలో దంచికొట్టిన వర్షం: ఉమ్మడి జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో మెదలైన వర్షం.. సాయంత్రం ఆరు గంటల వరకు నిరాంతరాయంగా కురిసింది. దాదాపు 3గంటలు కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో రోడ్లు కాలువలను తలపించాయి. రోడ్లపైకి వరద నీరు చేరటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను చవి చూశారు. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించటం.. అందులో డ్రైనేజీ నీరు కలిసిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. వర్షపు నీటి వల్ల రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక.. వాహనదారులు ఆందోళ చెందుతున్నారు. అధికారులు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచాలని ప్రజలు కోరుతున్నారు.
Drain Problems in Chilakaluripet: అనాలోచిత నిర్ణయం.. ప్రజలకు శాపం..