విజయవాడ నగరంలో జోరుగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం పడింది. ప్రధాన రహదారులతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. ఎంజీ రోడ్డు, బెంజ్‌సర్కిల్, ఆటోనగర్, గాంధీనగర్ ప్రాంతాలతోపాటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్లపై వర్షం నీరు నిలిచింది.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3.4 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బొల్లాపల్లి మండలంలో 49 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఈపురు 41.6, వెల్దుర్తి 34.2, రొంపిచర్ల 23.6, బెల్లంకొండ 14.2, సత్తెనపల్లి 9.2, క్రోసూరు 7, రాజుపాలెం 5.2, మాచర్ల 4.6, నరసరావుపేట 4.2, శావల్యాపురం 2.2, పెదకూరపాడు 1.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.