ETV Bharat / state

వామ్మో.. ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?

ఇంట్లో ఒక ఫ్యాన్​, ఒక బల్బు ఉంటే.. మహా అయితే వందో రెండొందలో కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఓ వృద్ధురాలికి మాత్రం ఏకంగా ఆ ఊళ్లో సగం ఇళ్లకు వచ్చే బిల్లును వేసినట్టున్నారు అధికారులు. వందలు దాటి వేలకు...వెళ్లింది కరెంటు బిల్లు. తల పట్టుకోవడం వృద్ధురాలి వంతైంది.

వామ్మో..ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?
author img

By

Published : Aug 13, 2019, 7:14 PM IST

heavy_power_bill_to_one_fan_and_bulb_at_gunturu
వామ్మో..ఫ్యాన్​, బల్బుకు ఇంత కరెంట్ బిల్లా?

గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలోని రేకుల ఇంట్లో ఓ వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె వాడే కరెంటు.. మహా అయితే ఓ లైటు.. ఓ ఫ్యానుకు మాత్రమే. అది కూడా రోజంతా వాడదు. అయినా.. ఆ పేద వృద్ధురాలికి అధికారులు 2 వేల 953 రూపాయల బిల్లు పంపారు. నెల నెలా వంద రూపాయలలోపే వచ్చే కరెంటు బిల్లు.. ఒకేసారి ఇంతలా వచ్చేసరికి ఆ వృద్ధురాలికి మతి పోయింది. ఇదెలా జరిగిందని.. అధికారులను అమాయకంగా అడుగుతోంది. ఆమె కష్టం తీర్చాల్సింది విద్యుత్ శాఖ అధికారులే.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.