కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై త్వరలో గుంటూరులో జరగనున్న సమీక్షా సమావేశానికి కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పరుషోత్తం రూపాల రానున్నట్లు మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కాక, రాయితీలు అందక.. రైతులు నష్టపోతున్నారని కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ రాశారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని లేఖలో వివరించారు. అందుకే పథకాల అమలు తీరును సమీక్షించేందుకు గుంటూరు రావాలని కోరగా.. కేంద్రమంత్రి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సూక్ష్మసేద్య పథకం, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేయటం లేదని.. ఉద్యాన పంటల రాయితీలను నిలిపివేసిందని లేఖలో జీవీఎల్ ఆరోపించారు.
మిరప సేద్యంలో ఆధునిక యంత్రాల ఉపయోగం అవసరం..
-
As Chairman of National Chilli Taskforce Committee, met Shri Parshottam Rupala Ji, Hon'ble Union Minister of State for Agriculture to seek intervention of his ministry/ ICAR for developing farm machinery for harvesting and post harvest management of Chillies. @PRupala pic.twitter.com/Qsbj2ls6zV
— GVL Narasimha Rao (@GVLNRAO) January 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As Chairman of National Chilli Taskforce Committee, met Shri Parshottam Rupala Ji, Hon'ble Union Minister of State for Agriculture to seek intervention of his ministry/ ICAR for developing farm machinery for harvesting and post harvest management of Chillies. @PRupala pic.twitter.com/Qsbj2ls6zV
— GVL Narasimha Rao (@GVLNRAO) January 22, 2021As Chairman of National Chilli Taskforce Committee, met Shri Parshottam Rupala Ji, Hon'ble Union Minister of State for Agriculture to seek intervention of his ministry/ ICAR for developing farm machinery for harvesting and post harvest management of Chillies. @PRupala pic.twitter.com/Qsbj2ls6zV
— GVL Narasimha Rao (@GVLNRAO) January 22, 2021
మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ హోదాలో నాలుగు నెలలుగా అధికారులు, రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించామని.. ఈ సందర్భంగా అనేక సమస్యలు గుర్తించామని జీవీఎల్ తెలిపారు. మిర్చి కోతల పంట విలువ పెంచేందుకు అనుబంధ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చాలని లేఖలో ఆయన కోరారు. మిరప సేద్యంలో వేరుచేయటానికి అవసరమైన యంత్రాలు అవసరమని అన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి అందుకు అవసరమైన యంత్రపరికరాలు సమకూరిస్తే రైతులకు మేలు జరుగుతుందని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైకాపాలో చేరిన చిలుకలూరి పేట తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి..