వైకాపా పాలనలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. పంటలకు కనీసం సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందించాల్సిన కనీస సామగ్రి వైకాపా ప్రభుత్వం అందించలేకపోతోందని ఆరోపించారు. రైతులకు ఎన్నో హామీలిచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్క దాన్ని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రైతులకు రుణాలు, కనీస సామాగ్రి అందించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాలు వైకాపా నాయకులకు కార్యాలయాలుగా మారాయని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఈ నెల 18వ తేదీన నరసరావుపేటలో తెదేపా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై రైతుగర్జన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇదీ చదవండి: