ETV Bharat / state

'ఆ ముగ్గురూ మద్దతుదారులే.. వైకాపాలో ఇంకా చేరలేదు' - పార్టీ ఫిరాయింపుల తాజా న్యూస్

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్న అంశానికి సీఎం జగన్​ ఇప్పటికీ కట్టుబడే ఉన్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం తదితరులు వైకాపాకు మద్దతు పలుకుతున్నారే కానీ.. వారెవెరూ అధికారికంగా పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్​మీట్​

author img

By

Published : Mar 14, 2020, 9:33 PM IST

మాట్లాడుతున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్​ రెడ్డి

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకుంటామన్న మాటకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో చక్రపాణి రెడ్డి అలానే చేశారని ఆయన గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనను చూశాకే తెదేపా ఎమ్మెల్యేలు తమ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారని వ్యాఖ్యానించారు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు.. వైకాపా ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చేది లేదని స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించారని అన్నారు.

ఇప్పుడు పార్టీలకు అతీతంగా మంచి జరుగుతుంటే.. తెదేపా ఎమ్మెల్యేలు జగన్​ను ప్రశంసించటంలో తప్పేమిటని అన్నారు. 'దిశ' చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చారని.... అంటే 'చంద్రబాబు వైకాపాలో పార్టీలో చేరినట్లా' అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలగిరి, కరణం బలరాం తదితరులు వైకాపా మద్దతు పలుకుతున్నారని... వారెవెరూ అధికారికంగా పార్టీలో చేరలేదని తెలిపారు. నామినేషన్లు అడ్డుకుంటున్నారంటూ చెబుతున్న చంద్రబాబు... వారి పార్టీకి చెందిన వ్యక్తులు దాఖలు చేసిన 19 వేల నామినేషన్ల గురించి ఏం చెబుతారన్నారు.

ఇదీ చూడండి:

వైకాపా తీరుపై.. తిరుపతిలో భాజపా కార్యకర్తల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.