గుంటూరు జైలు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళలు సందులో ఉంటే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. వారిని అరండల్పేట 8వ లైన్ నుంచి 13వ లైన్ వరకు వెంబడించారు. అనంతరం పోలీసులు వెళ్లిపోయారు.
శాంతియుతంగా నిరసన తెలపడానికి అమరావతి నుంచి వచ్చిన తమను పోలీసులు విచ్చలవిడిగా లాగేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, మహిళలను అని కూడా చూడకుండా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ అధికారంలో ఉన్నంతవరకు రాష్ట్రాభివృద్ధి జరగదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్