ETV Bharat / state

ఉపాధి పనులపై అధికారుల విచారణ - news on mgnregs works

గత ప్రభుత్వ హయాంలో ఎంజీఎన్​ఆర్​ఈజీఏ కింద గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులపై విచారణ జరుగుతోంది. ఉపాధి హామీ పథకం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులతో అనుసంధానం చేసుకుని గతంలో పనులు చేశారు. దీనికి సంబంధించి బిల్లుల చెల్లింపుల విషయంలోనూ క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. త్వరలోనే ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించనున్నారు.

enquiry on nrega works
గుంటూరులో ఉపాధి పనులపై కొనసాగుతోన్న విచారణ
author img

By

Published : Jun 14, 2020, 2:07 PM IST

గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎంజీఎన్​ఆర్​ఈజీఏ) కింద గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై విచారణ తుది దశకు చేరింది. ఐదు ఇంజినీరింగ్‌ శాఖలకు చెందిన నాణ్యత, నియంత్రణ విభాగం అధికారులు పది బృందాలుగా ఏర్పడి జిల్లాలో పనులను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల తీర్మానంతో ఉపాధి హమీ పథకం నిధులు అనుసంధానం చేసుకుని పల్లెల్లో పెద్దఎత్తున ప్రగతి పనులు చేశారు. ఇందులో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని, పనులు పరిశీలించి విచారణ చేసిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో రూ.228 కోట్లతో 1912 పనులు చేపట్టి పూర్తిచేశారు. ఉపాధి హామీ పథకం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులతో అనుసంధానం చేసుకుని పనులు చేశారు. వీటన్నింటిని గ్రామ పంచాయతీల తీర్మానంతో నామినేషన్‌పై చేశారు. పనులను పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు పర్యవేక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నూతనంగా వచ్చిన ప్రభుత్వం బిల్లులు చెల్లింపులు నిలిపివేసి విచారణకు ఆదేశించింది.

కేత్రస్థాయిలో కొనసాగుతున్న విచారణ
జిల్లాలో గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి పది ఇంజినీరింగ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రామీణాభివృద్ధిశాఖ, జలవనరులశాఖకు చెందిన బృందాలు మండలాల వారీగా గ్రామాల్లో తిరుగుతూ పనులను పరిశీలిస్తున్నాయి. ప్రతి బృందం ఒక డీఈ ఆధ్వర్యంలో మూడు నుంచి నాలుగు మండలాల్లో పనులను తనిఖీ చేస్తోంది. సిమెంటు రోడ్లు, పంచాయతీ భవనాలు, చెత్తతో సంపద తయారీ కేంద్రాలు, మురుగు కాల్వల నిర్మాణం తదితర పనులను పరిశీలిస్తున్నారు. కాంక్రీటు కోర్‌లు తీసి ప్రయోగశాలకు పంపి ఫలితాలను విశ్లేషిస్తున్నారు. చాలాచోట్ల కాంక్రీటు నిర్మాణాలు చేపట్టే క్రమంలో నీటితో సక్రమంగా క్యూరింగ్‌ చేయకపోవడం వల్ల నిబంధనల మేరకు నాణ్యత లేనట్లు విచారణ చేస్తోన్న బృందాలు గుర్తించాయి.

గతంలో రోజువారీగా కొన్ని కిలోమీటర్ల మేర సిమెంట్‌ రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేశారు. ఈక్రమంలో మండలంలో ఒకేరోజు పదిచోట్ల పనులు జరుగుతుండటంతో పర్యవేక్షించే ఇంజినీర్లు పూర్తిస్థాయిలో నాణ్యతపై దృష్టిసారించ లేకపోయారు. ఈ క్రమంలో సరిగా క్యూరింగ్‌ చేయకపోవడం వల్ల నాణ్యతకు బీటలు వారినట్లు చెబుతున్నారు. ఈమేరకు బిల్లులలో కోత విధించడంతోపాటు బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేసే అవకాశముంది. ఇప్పటివరకు 1260 పనులను తనిఖీ బృందాలు పరిశీలించాయి. మిగిలినవాటిని వీలైనంత త్వరగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఇప్పటికే 79 పనులకు సంబంధించిన నివేదికలను ఇంజినీర్ల బృందాలు సిద్ధం చేశాయి.

మరోవైపు నిఘా విభాగం బృందం కూడా గ్రామాల్లో పనులను తనిఖీ చేస్తోంది. వీరు కూడా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతుండటంతో అప్పట్లో పని చేసిన అధికారులు ఆందోళన చెందుతున్నారు. తనిఖీల పేరుతో ఇంకా ఎన్నాళ్లిలా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తారని పనులు చేసిన వ్యక్తులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామాలకు చెందిన నేతలే అప్పట్లో పనులు చేశారు. తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వీరికి బిల్లులు మంజూరు చేసే అవకాశముందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆన్‌లైన్‌ ద్వారానే ప్రవేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.