ETV Bharat / state

మలేషియాలో గుంటూరు యువకుడు అదృశ్యం!

మలేషియాలో గుంటూరు యువకుడు అదృశ్యమయ్యాడు. మలేషియాలోని ఓ ప్రైవేటు నావికా సంస్థలో అధికారిగా పనిచేస్తున్న కాకర్ల శ్రీనివాసరావు కన్పించడం లేదని ఈ నెల 3న ఆరండల్ పేట పోలీసులను అతని సోదరుడు వెంకటేశ్వరరావు ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని వెంకటేశ్వరరావు వాపోయారు.

Guntur man missed at Malaysia
Guntur man missed at Malaysia
author img

By

Published : Jun 10, 2021, 8:57 AM IST

మలేషియాలో నావికాధికారిగా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. కొంతకాలంగా ఓ ప్రైవేటు నావికా సంస్థలో అధికారిగా పనిచేస్తున్న కాకర్ల శ్రీనివాసరావు కన్పించడం లేదని గుంటూరులోని అతని స్నేహితుడు రాజేంద్రకు సమాచారం అందింది. ఈ విషయాన్ని శ్రీనివాసరావు సోదరుడు వెంకటేశ్వరరావుకు తెలియజేశారు.

శ్రీనివాసరావుకు విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. అతని అదృశ్యం వెనుక కారణమేంటో తమకు అర్థం కావడం లేదని సోదరుడు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో యువతితోపాటు అతని స్నేహితుడిని విచారణ చేయాలంటూ వెంకటేశ్వరరావు.. ఈ నెల 3న ఆరండల్ పేట పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేయలేదని వెంకటేశ్వరరావు వాపోయారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి.. తమ తమ్ముడి ఆచూకీ తెలిజేయాలని కోరారు.

ఇదీ చదవండి:

వైరస్​ ముప్పు.. ఏ వాహనంలో ఎలా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.