ప్రేమోన్మోదానికి మరో యువతి బలైంది. గుంటూరు జిల్లా అలీనగర్‌లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు షేక్ కరీం అలియాస్ నాగూర్ యువతిని దారుణంగా హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడం వల్లే యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
"నజీమా నిందితుడు షేక్ కరీం ప్రేమించుకున్నారు. నజీమా పెళ్లి ప్రస్తావన తీసుకురావంటంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ప్రణాళిక ప్రకారం వారిద్దరూ కలుసుకునే గదికి ఆమెను రప్పించి ఏకాంతంగా గడిపారు. ఆమె మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో కోపోద్రిక్తుడై...ఆమె తలను గోడకేసి బాదాడు. తలకు గాయమై సృహ తప్పి పడిపోయిన ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముందుగా తెచ్చి పెట్టుకున్న కట్టర్‌తో శరీరాన్ని ముక్కులుగా కట్‌చేసి ప్లాస్టిక్ కవర్లో మూటగట్టి నిర్జన ప్రదేశంలో పడేశాడు. రెండురోజుల తర్వాత మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి శరీరాన్ని తగులబెట్టాడు. అనుమానిత శవం దొరికిందన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శరీర అవయవాలను డీఎన్ఏ పరీక్షకు పంపగా...మృతదేహం కనిపించకుండా పోయిన నజీమాదిగా గుర్తించాం. ఈ కేసులో ముద్దాయిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేశాం" -అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ
నిందితుడిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. అతని వద్ద నుంచి కట్టర్, నజీమా ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి